2016/03/22

ఎందుకు కుటుంబం కుంటుపడుతుంది?

|| జై శ్రీమన్నారాయణ || 

అసలు విషయానికొస్తే ...
ఒక ఉన్నతాధికారికి ప్రభుత్వం ఎందుకు డ్రైవర్ ని, కారుని, నౌకరుని ఏర్పాటు చెస్తుంది?...ఏం, తనపని తాను చేసుకోలేడా? తనకి డ్రైవింగ్ రాదా? కారు కొనుక్కోలేడా? అని మనకు అనిపించొచ్చు. కాని నిజానికి ఆ ఉన్నతాధికారి తన స్వంతపనులన్నీ తనకి తాను సమాంతరంగా చేసుకుంటూ పోతే.. ప్రభుత్వపరంగా తాను చేయ వలసినపనిలో "ఉత్పాదకత" (productivity) - "నాణ్యత" (quality)తగ్గి పోతాయి..పనులు కుంటుపడతాయి..నిజానికి ఇది చాలా ప్రధానవిషయం.
కుంటుంబ యజమాని కూడా తన స్వంతపనులు తాను చేసుకుంటూ, పోషణ - భద్రత- సౌకర్యాల వంటి భాద్యతలు కూడా సమాంతరంగా నిర్వహించుకుంటూ పోవడంవల్ల కుటుంబ " అభివృద్ది " "ఉత్పాదకత" - "నాణ్యత" తగ్గిపోతాయి. కుటుంబం కుంటుపడుతుంది... మన పెద్దలు మూర్ఖులు కారు.. జ్ఞానవంతులు. అర్థంచేసుకోండి.
అలాగే జ్ఞానం-సబ్జెక్టు ఉన్న ఒక ఇంటెలెక్చువల్ విషయం లో కూడా ఇదే జరుగుతుంది ... అలాంటి వారికి ఇండియాలో గురువులంటారు లెండి. నిజానికి వారికి ఎవ్వరీ సేవా అవసరం ఉండదు. వారిని సేవించడం అనేది మన అవసరం.
కుంటుంబ జయమాని చేతనైనంత ఎక్కువ సమయం కుంటుంబ వృద్దికోసం కేటాయించేలా అతనికి, 1) సేవతో సహకరించడం,2) కృతజ్ఞతతో ప్రోత్సహించడం అనేది పూర్తి కుంటుంబసభ్యుల బాధ్యత. అంతేకాదు అది కుంటుంబసభ్యుల "ప్రధాన కర్తవ్యం" ..
అర్థం చేసుకున్న వాళ్ళు సహకరిన్స్తున్నారు. పెడార్థాలు తీసే వారు నాశనం చేసుకుంటారు.

ఇదే విషయాన్నే చాగంటి గారు ఇటీవల చెప్పారు... మనం ఇంకోలా అర్థంచేసుకుంటున్నాం. .
భార్య, భర్త బట్టలు ఉతకడం అనేది తాను కుంటుంబానికిచ్చే సహకారం. సేవకి-ఊడిగానికి చాలా తేడా ఉంటుంది. 

మనం నాగరికులం, అడివిలో బ్రతకట్లేదు కదా .
అడవిలో మనకి ముసలిజంతువులు, అనారోగ్యమైన జంతువులు కనబడవు. ఎందుకంటే ఆడవిలో బలహీణమైనవి బతకలేవు. ఎందుకంటే వాటికి కుంటుంబం -సేవ అనే కాన్సెఫ్ట్ ఉండదు. అవి వివశతతో బతికేవి. అలోచించండి.

కాని సమాజం వేరు, మనమిక్కడ సంఘజీవులం. మనిషి కుటుంబవ్యవస్థని ఏర్పరుచుకొని పరస్పరం కుంటుంబసభ్యుల సేవ-సహకారాలతో జీవనప్రమాణాన్ని, నాణ్యతని పెంచుకుంటూ వచ్చాడు. ఇది కొన్ని వందల వేల సంవత్సరాలనుండి వస్తున్న "పరంపర".

కుంటుంబం వ్యక్తుల ఆర్థికస్వావలంబనతో నడుస్తుంది అనడం మూర్ఖత్వం.
నిజానికి కుంటుంబం ఉనికి రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది.
1 సేవ 2 కృతజ్ఞత
1 సేవ : ప్రతిఫలం ఆశించక ఎదుటివారి మేలుకోరి చేసిపెట్టే పనిని సేవ అంటారు.
కుంటుంబంలో ఒకరిపట్ల ఒకరికి సేవాభావం ఉండాలి.
అనారోగ్య పరిస్తితుల్లో మనమన కుటుంబసభ్యుల సేవని ఎలాగో చేస్తాము.
కాని
లేత పసిపిల్లల మలమూత్రాలు శుభ్రంచేసి, ఆహారం అదించడం ఎంత అవసరమో ,
పండు ముసలివారి మలమూత్రాలు శుభ్రంచేసి, ఆహారం అదించడం అంతే అవసరం..ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ అవసరం.
దానిలోని గొప్పతనం, హుందాతనం, సంతృప్తి, కేవలం ఆ సేవచేసే వారికే తెలుస్తుంది. అసహ్యించుకునే-చీదరించుకునె- తప్పించుకునే పనికిమాలినవారికి ఇది అర్థంకాదు. ఇది నిజం.
కుంటుంబంలో సేవకి పెద్ద-చిన్న తేడాలేదు. కాని, వయసూ వారి సమర్థతని దృష్టిలో ఉంచుకొని సేవలు చేయడమో లెదా చేయించూకోవడమో చేయాలి. పరస్పర ప్రేమాభిమానాలు ముఖ్యం.

2) రెండవది కృతజ్ఞత : కుంటుంబం యొక్క ఉనికిపై, కుంటుంబసభ్యులు నిర్వర్తిసున్న బాధ్యతలపై స్పృహ కలిగి ఉండడాన్ని కృతజ్ఞత అంటాం .
సేవ చేయించుకునే వారు సేవచేసే వారిపట్ల అలాగే, సేవచేసే వారు చేయించుకునె వారిపట్ల. పరస్పరమూ స్పృహతొ - కృతజ్ఞతతో మెలగడం అతి ముఖ్యమైన విషయం.
కృతజ్ఞతని వదిలి కేవలం సేవని ఆశించినా..
సేవని వదిలి కేవలం కృతజ్ఞతని ఆశించినా.. అది కుంటుంబాన్ని దెబ్బ తీస్తుంది. అది దుర్మార్గం కూడా.
ముఖ్య విషయం, కృతజ్ఞత లేదా సేవ లోపిస్తే గుర్తు చెయాల్సిన బాధ్యత ఇంటి పెద్దలది..కాని వారికి ఆదరణ కరువైంది.
పై రెండూ లేకనే కదా..
ఇప్పుడు కుంటుంబాలు పెద్దలు లేని అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య లాంటి పదాలు వినపడని " మైక్రో ఫ్యామిలీస్" తయారవుతున్నయి .
మంచి చెప్పేవారు లేని కౌన్సిలింగ్ మీద ఆధారపడే "నానొ ఫ్యమిలీస్ " తయారవుతున్నాయి .
జంటలు పెళ్లైన రెండేళ్లకే విడాకుల దాకా పరిగెత్తే పరిస్తితులు తయారవుతున్నాయి .
వృద్దాశ్రమాలకి డిమాండులు పెరిగిపోతున్నాయి.
మానసిక చికితల ప్రాధాన్యాలు పెరిగిపోతున్నయి.
ధనం అవసరం నుండి అత్యవసరంగా మారిపోయింది.
కుటుంబంలో రాజకీయ నాయకులజోక్యం , ఇతర సంస్థలజోక్యం, బయటి వ్యక్తులజోక్యం ఎక్కువపైపోతున్నాయి.

నిజానికి మనసేవ మీద ఎవ్వరు అధారపడి లేరు.. ఎందుకంటే మనబ్రతుకు ఎదుటివాడు బ్రతకలేడు.. అలాగే ఎదుటివారి చావు మనం చావలేము...
సేవ చేసినా చేయక పోయినా జరగాల్సినవి జరుగుతాయి... నష్టపోయేది నిజానికి మొత్తం కుటుంబమే. అదే నిజానికి " దరిద్రం" అంటే.
సేవ విషయంలో మనకు శ్రీకృష్ణుడే ఆదర్శం :
తనని కలుసులోవడానికి ఎన్నో మైళ్ల దూరమ నుండి నడచి వచ్చిన నిరుపేద కుచేలున్ని సాదరంగా ఆహ్వనిన్చి . అలసిన పాదాల మధ్య లో ఇరుక్కుఇ పోయిన రాళ్లని, ముళ్లని తీసి , ఆ పాదలని కడిగి, ఆ జలాన్ని తలమీద చల్లు కొని , భార్య తలమీద కూడా చల్లి. కడుపునిండా భోజనం పెట్టి విధ్యామరలతో "నిశ్చింతుడయ్యెంత వరకూ" సేవ చేసిన శ్రీకృష్ణుడే ఈ విషయం లో మనకి ఆదర్శం.
చేతివ్రేళ్లు తెగిపోయిన కుష్టిరోగుల గాయాలని రోజూ శుభ్రం చేసి సేవ చేసుకున్న గాంధీ మనకి ఆదర్శం.
మనం పుట్టుకకు తరవాత మన అమ్మకి పచ్చి బాలింత-సేవలు చేసిన మన అమ్మమ్మ-నాన్నమ్మలు మనకి ఆదర్శం
మనకు దెబ్బతగిలితే కళ్లలో నీళ్ళు , ఆకలైతే గుండెలో పాలు తెచ్చుకున్న అమ్మ సేవ మనకి ఆదర్శం.
వారందరి పాదధూలి నా శిరస్సు పై సదా ఉండు గాక.
సేవతోనే మనుషులు సరళులవుతారు, తేలికవుతారు, పునీతులవుతారు, సంతృప్తి పొందుతారు, ప్రయోజకులవుతారు, పవిత్రులవుతారు, తరించి పోతారు. ఇది నగ్న సత్యం.
స్వస్తి!
-సత్య  

2016/03/21

అతివాదుల అతివాగుడు

ఇక్కడ అతివాదుల అతివాగుడు క్రింది విధంగా ఉంది ..
"1. భక్తి అనేది మతపరమైన పదం.
2. భక్తి అనేది మూఢత్వం.
3 .నేను దేశాన్ని ప్రేమిస్త, కాని పూజించను. (పూజ కూడా మతపరమైన పదం)
4. నేను దేశ-ప్రేమికున్ని మాత్రమే దేశ-భక్తున్ని కాను-కాబోను "
పైమాటలు విని మోసపోయే అమాయకులకి నేను చెప్పదల్చుకున్నదేమిటంటే ...
భక్తి దేశం మీద సహజంగా పుట్టే భావం -అది కేవలం భారతీయ భావము..
నాకు నా చొక్కా అంటే ప్రేమ అనొచ్చు..కాని నాకు నా చొక్కా అంటే భక్తి అనలేము
నాకు కుక్కంటే నాకు ప్రేమ అనొచ్చు ..కాని నాకు కుక్కంటే భక్తి అనలేము
నాకు తమ్ముడంటే ప్రేమ అనొచ్చు.. కాని నాకు తమ్ముడంటే భక్తి అనలేము

పైన తెలిపిన లాంటి వాటిల్లో ప్రేమ పదాన్ని వాడొచ్చు... కాని "భక్తి" పదాన్ని వాడలేము
ఎందుకంటే పైవన్నీ మనకన్నా తక్కువవి లేదా మనతో సమానమైనవి .. అందుకే అలాంటి వాటితో కేవలం ప్రేమ! ..భక్తి కుదరదు!!
కాని...
నాకు అమ్మంటే ప్రేమ అనొచ్చు... అలాకే నాకు అమ్మంటే భక్తి అని కూడా అనొచ్చు
నాకు నా న్నంటే ప్రేమ అనొచ్చు... అలాకే నాకు నాన్నంటే భక్తి అని కూడా అనొచ్చు
నాకు గురువంటే ప్రేమ అనొచ్చు... అలాకే నాకు గురువంటే భక్తి అని కూడా అనొచ్చు
నాకు పుస్తకమంటే ప్రేమ అనొచ్చు... అలాకే నాకు పుస్తకమంటే భక్తి అని కూడా అనొచ్చు
ఎందుకంటే పైవన్నీ మనకన్నా ఎక్కువైనవి పైగా ఆరాధించ దగ్గవి .. అందుకే కేవలం ప్రేమించడమే కాక భక్తి కూడ చేయొచ్చు..
అదే ప్రేమకి భక్తి కి తేడా...
దేశం మీద ఉండల్సింది ఎప్పుడూ భక్తే... (త్యాగం తో కూడిన ప్రేమ)
భక్తి ఉన్నచోటా ఎలాగూ ప్రేమ ఉంటుంది.
భక్తి ఏదో "మతపరమైన" పదం కాదు. అది ఆరాధనా భావము, త్యాగ భావము... ప్రేమకన్నా గొప్ప భావము.
అది దేశం మీద సహజంగా పుట్టే భావం -అది కేవలం భారతీయ భావము..
స్వస్తి!
-సత్య

2015/10/21

అవి వారి ద్వంద్వ-ప్రమాణాలని తెలుపుతున్నది!



---


అవి  వారి ద్వంద్వ-ప్రమాణాలని తెలుపుతున్నది!
ఇప్పుడు తెలిసొస్తుంది. వారు అప్పుడు కూడా ఇలాగే చేసున్నాబాగుండు. వారు ఒక సమస్యగా తెలియకపోయేవారు.
నాకు తెలిసి సార్వత్రీకులనుకున్నా. తను అంతర్మయులనుకున్నా, సర్వసములనుకున్నా.సడలిన హృదయాలని సున్నితంగా తాకినవాళ్లు  కదా , హృద్దయాంతరాల సజీవ స్పందననుకున్న. కాలాతీతమైన అప్రతిహత ఆదర్శాక్షరధారనుకున్న. వారిదాకా వచ్చేసరికి,వారిప్పుడు వారి బాధలని మాత్రమే చూస్తున్నారు. నిజరూపం చూపిస్తున్నరు. ద్వంద్వం బయటపెడుతున్నరు. తెగిడిస్తున్నరు. రచ్చ చేస్తున్నరు.వారు అప్పుడు కూడా ఇలాగే చేసున్నాబాగుండు. వారు మారిందీ మార్చిందీ ఏమీలేదు.పిలిచిందీ పలికిందీ ఏమీలేదు.ఆదినుండీ అన్యాయాలు-అరాచకాలూ-అత్యాచారాలూ జరుగుతున్నా,ఆచరణలేని అక్షరాలని వివాదాయుధాలుగా తెలివిగా ప్రయీగించేవాళ్ళు వీరు. వారు స్వంత అస్తిత్వ వాదాలు నూరబోసేవాళ్ల్య్. లాభాల పంటని ఉనికికోసం అమ్ముకునేవాళ్లు. నేడు స్వార్థ సంకుచితమైన రాచకీయాచరణలకి ఒడిగడుతున్నారు రచ్చ జేస్తున్నారు. రాచకీయ కీలుబొమ్మవుతున్నరు. వారిప్పుడెందుకో కొత్తగా ఆచరణతో మాట్లాడుతున్నాడు.అణగారిపోతున్నాడు .వారెప్పటిలాగే కేవలం అక్షరాలని మాత్రమే తర్పణమొదుల్తాడనుకున్నాను. కాని వారిదాకా వచ్చేసరికి తెలిసొచ్చినట్టుంది. ఆదర్షం లేని అక్షరాలకి-అత్యవసరమైన ఆచరణకి తేడా.

పండు చీకి టెంక ఇచ్చినట్టు లాభాలూ మర్యాదలూ మన్ననలు అన్నీ పొంది ఇపుడు అవాఋడులు
వాపసిచ్చేస్తున్నరు...

అసలైన కారణ కేద్రం సాహిత్య అవార్డుల నిధులని 23 కోట్లనుండి 9 కోట్లకి కుదించడమే ...


అయినా 84 నుండి జరుగుతుంటే... ఇప్పుడే ఎందుకు?
అబిజిత్ రాయ్, తస్లీమా నస్రీన్ ల పై దాడి జరిగినప్పుడు అసలెక్కడ పోయారు? ఎంతమంది వెనక్కి ఇచ్చారు? అవిమాత్రమేనా? రితోషకాలు? వాటితో పొందిన ఆస్తులు? వాటిపై చేసిన వాగ్దానాలు?తెప్పించుకున్న పేరు? కప్పించుకున్న శాలువాలు? ఆడిన డ్రామాలు కూడా వెనక్కి ఇచ్చేసారా మరి? దేశభక్తికి-మానవత్వానికి-త్యాగాలకి మధ్య తేడా ఏంటో తెలుసా? అవార్డులు పాత బడ్డాయనా లేక మీరు పాతబడ్డారనా? పాపులారిటీని రెన్యువల్ చేసుకోవాలా, ఫ్రీగా ?"కమ్యునల్ పోయిజన్" ఇప్పుడే ఇక్కడే ఇలాగే పుట్టిందా? .....

వారిప్పుడు చూపిస్తున్న "ద్వంద్వం", వారు  గతంలో ముసుగేసుకొని చేసిన పనుల "ప్రమాణాలని" చూపున్నది...అవి ద్వంద్వ-ప్రమాణాలని తెలుపుతున్నది!

Anyway giving awareness is my contribution for the pseudo world!

-సత్య

2015/04/24

ఎగ"తాళి" !!



ముప్పై ఏళ్లక్రితం అప్పటి తరం పెద్దలు , ప్రేమ పేరుతోనో, ఆదర్శ వివాహం పేరుతో నో, సమాజాన్ని ఎదిరించి, ఎవరినా పెళ్లిల్లు చేసుకుంటే  పెడబొబ్బలు పెట్టారు-మొత్తుకున్నారు-బాధపడ్డారు.

అప్పుడు ఆ ప్రేమ పెళ్ళిలు చేసుకున్న ఈ తరం పెద్దలే , ఇప్పటి జంటలు  "సహజీవనం" (living relationship) చేస్తుంటే పెడబొబ్బలు పెడుతున్నారు-మొత్తుకుంటున్నారు-బాధపడుతున్నారు.

పైగా "అసహజమైన" మార్పులని "ఇది సహజమే" అనే మూర్ఖులూ లేకపోలేరు.

ఒకప్పుడు స్త్రీ పురుషుల మధ్య సమానత్వానికి సంబంధిన్చిన "గొడవలు" ఉండకపొయేవి.  

స్త్రీ తన భర్త చనిపొతే ఎలాగైతే  బొట్టూ-తాలిబొట్టూ తీసేసేదో, అలాగే
భార్యని కోల్పోయిన పురుషుడు  కూడా తన బొట్టు ని తీసేసి, అలాగే రోజూ తన భుజాన ఎడమ వైపున వేసుకునే "కండువాని", ఎడమ నుండి కుడివైపుకుకి మార్చుకొని (భార్యా విహీనుడిగా) వ్యవరంచే వాడు. అది వారి సహజత్వానికి సరళత్వానికి ప్రతీక.
అది ఒకప్పటి సంస్కృతి- నగరికత  పై వారికున్న శ్రద్ద.అంతే!

నేడు పురుషుడు సప్రదాయబద్దంగా కనబడడు...

నేడు పురుషాధిక్యత వల్ల , పాశ్చాత్య విషధోరణుల వల్ల గత అరవై ఏళ్లుగా పురుషునిలో సాంస్కృతిక పరంగా చాలా మార్పులొచ్ఛాయి...
వాటి గురించి ఎవ్వరూ మాట్లాడరు!...

ఇంకో దురదృష్టం ఏంటంటే, సమానత్వం పేరుతో ఇప్పటి కొన్ని స్త్రీ-సమూహాలు కూడా "అధిపత్యం" కోసం ప్రయత్నించడం!!

నిజానికి కావల్సింది ఆధిపత్యం కాదని సమానత్వమని. స్థిరత్వమని వీరికి ఎప్పుడు అర్థమౌతుందో! (ఇద్దరికీ)

విషపరిణామం ఏమిటంటే "సామూహిక బాధ్యత" కరువవ్వడం! ( lack of collective responsibility )


ప్చ్.... "బాధ్యత లేని బతుకులతో భావితరాలని బలి తీసుకోవడం బాధాకరం!"

వీటిని అదునుగా చేసుకొని కుటిల మైన సాంస్కృతిక దాడులని చేసే రాజకీయ వర్గాలు, గత అరవై ఏళ్లుగా కొన్ని తుచ్చమైన పనులని చేస్తూనే ఉన్నయి...

అలాంటిదే ఈ తాళిని తెంపే నీచకార్యం.

ఒకప్పుడు తమిళ నాట రామాయణాన్ని తగలబెట్టడం జరిగింది.... ఇక్కడ రామాయ విషవృక్షాల నాటే ప్రయత్నం జరిగింది..ఇలా ఎన్నెన్నో... అస్తిత్వం-గుర్తింపూ-సంచలనాల పిచ్చి మనిషిని దిగజారుస్తూనే ఉంది.  

" రచ్చ చేసేవాళ్ళని రెచ్చ గొట్టే పని" ని మన మీడియా వాళ్లు "వ్యాపారం లో భాగంగా" నిర్లజ్జగా నిర్వహిస్తున్నారు.  

"సంస్కృతి పై క్లేశాలేర్పడినప్పుడు ఆస్తిక పరమైన సంఘటితశక్తి మన కనీస అవసరమ"ని మన "ఆధ్యాత్మ విజ్ఞులకి" ఎప్పుడు అర్థమౌతుందో ఏమో!
స్వస్తి.
-సత్య